12 కిలోల వెండి స్వాధీనం
1 min readవివరాలు వెల్లడించిన సెబ్ సీఐ లక్ష్మి దుర్గయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు క్రైం: రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన పంచలింగాల చెక్ పోస్టు వద్ద సెబ్, లోకల్ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా 12 కిలోల వెండి పట్టుబడిన ఘటన ఆదివారం రాత్రి 10.30 గంటలకు చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు హోండా యాక్టివ్ ( ఏపీ 39 మీజే 1614)లో వస్తున్న రాజస్థాన్ లోని పాలి జిల్లా, గాయత్రి కాలనీకి చెందిన ఘన్‌శ్యాం అనే వ్యక్తిని సెబ్ పోలీసులు తనిఖీ చేయగా… అతని నుంచి 12 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. అతని వద్ద ఎటువంటి బిల్లులు, పన్ను చెల్లింపులు, ఆధారాలు లేకపోవడంతో వెండి, బైక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సెబ్ సీఐ లక్ష్మి దుర్గయ్య వెల్లడించారు. వెండి, బైక్‌ను తాలూకా పోలీస్ స్టేషన్లో అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. తనిఖీలో సెబ్ ఎస్ఐ శివప్రసాద్, హెడ్ కానిస్టేబుల్ ఖాజ, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, హననుమంత నాయక్, సలీం తదితరులు ఉన్నారు.