బందీలుగా 3 లక్షల మంది పౌరులు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల మంత్రి డిమిట్రో కులేబా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని రష్యా ఉల్లంఘించిందని ఆరోపించారు. రష్యా సైన్యం చుట్టుముట్టిన మరియుపోల్ నగరంలో రష్యన్ సేనలు 3 లక్షల మంది పౌరులను నిర్బంధించాయని ఆరోపించారు. చాలా రోజులు వారికి నీళ్లు, ఆహారం అందడం లేదని, దీంతో ఓ చిన్నారి డీహైడ్రేషన్‌తో మరణించినట్టు చెప్పారు. ఉద్దేశపూర్వకంగానే రష్యా యుద్ధ నేరాలకు పాల్పడతోందని, అది కూడా వారి వ్యూహంలో భాగమని ట్వీట్ చేశారు.