స్టాక్ మార్కెట్ ను కుదిపేసిన కోవిడ్ భయం
1 min readముంబయి: స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కోవిడ్ కేసులు ఇన్వెస్టర్లలో భయాన్ని రేకెత్తించాయి. మరో వైపు ఈ వారంలో ఆర్ బీఐ సమావేశాలు, అలాగే దేశీయ కంపెనీల త్రైమాసిక ఫలితాలు త్వరలో వెలువడనున్న నేపథ్యంలో .. ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఫలితంగా నిఫ్టీ, సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీలు భారీ నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం 10.30 నిమిషాల సమయంలో నిఫ్టీ.. 300 పాయింట్లు నష్టపోయింది. బ్యాంక్ నిఫ్టీ..1252 పాయింట్ల నష్టాన్ని నమోదుచేసింది. ఇన్వెస్టర్లలో నెలకొన్న భయమే.. ఇంత పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్లలో నష్టానికి కారణం. ఇటీవల కాలంలో ఇంత భారీగా నష్టపోలేదు. మార్కెట్ ఓపెనింగే .. భారీ నష్టంతో ఓపెన్ అయింది. దీని బట్టి మార్కెట్లో భయం ఎంత మేరకు ఉందనే విషయన్ని అంచనా వేయవచ్చు.