కోవిడ్ విజృంభణ.. ఐపీఎల్ పై ఉత్కంఠ
1 min readముంబయి: ఐపీఎల్ మ్యాచ్ లు వచ్చే శుక్రవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఐపీఎల్ కు ముంబయి వేదికగా ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయి. స్టేడియంలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయి. క్రికెటర్ల కసరత్తులు కొనసాగుతున్నాయి. కోట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. మరోవైపు అదే స్థాయిలో కరోన వైరస్ కూడ విజృంభిస్తోంది. ప్రతి రోజు కేసుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పాక్షికంగా లాక్ డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మీద నీలినీడలు కమ్ముకున్నాయి. కరోన భయం.. ఐపీఎల్ మీద అభిమానం కోట్లాదిమంది వీక్షకుల్ని అయోమయంలోకి నెట్టేసింది. ఐపీఎల్ సజావుగా జరుగుతుందా? లేదా? అన్న అనుమానం, ఆందోళన వీక్షకుల్లో మొదలైంది.
యథాతథంగా ఐపీఎల్
కేసులు పెరుగుతున్నా సరే.. ఐపీఎల్ కొనసాగుతుందని తెలిపారు మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్. స్టేడియంలోకి ప్రజల్ని అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే టోర్నితో సంబంధం ఉన్న వాళ్లకు, క్రికెటర్లకు ప్రత్యేక ఐసోలేషన్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. శుక్రవారం నుంచి ఐపీఎల్ 14వ సీజన్ ప్రారంభం అవుతుంది. మెదటి భాగంలో చెన్నై, ముంబయి వేదిక అవుతున్నాయి. ఏప్రిల్ 9 నుంచి 25 వరకు రెండు చోట్ల పదేసి మ్యాచ్ లు జరుగుతున్నాయి. 9న ముంబయి, బెంగళూరు మధ్య చెన్నై వేదికగా.. 10 న చెన్నై, ఢిల్లీ మధ్య ముంబయి వేదికగా మ్యాచ్ జరుగుతుంది.