మిర్చి ధర అదరహో.. క్వింటాల్ ధర ఎంతంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : సింగిల్‌పట్టీ రకం మిర్చి ధర క్వింటాకు రూ.40వేలు పలికి చరిత్ర సృిష్టించింది. గత వారం చపాటా రకం రూ. 32వేల ధర పలికింది. మార్కెట్‌కు గత కొన్ని రోజులుగా చపాటా, సింగిల్‌పట్టీ, తేజ, వండర్‌హాట్, దీపిక, 1048 రకం, 341 రకం మిర్చి పోటెత్తుతోంది. సింగిల్‌పట్టీ, చపా టా రకాలను పచ్చళ్ల తయారీకి ముఖ్యంగా మామిడికాయ పచ్చడి తయారీకి ఉపయోగిస్తారు. ఈ మిర్చి పౌడర్ స్వచ్ఛమైన ఎరుపుదనం, కారం, రుచి కలిగి ఉంటుంది. ఈసారి వైరస్, అకాలవర్షాల వల్ల 90శాతం మిర్చిపంటలు నాశనమయ్యాయి. ఫలితంగా దిగుబడి బాగా తగ్గింది. దీంతో వచ్చిన అరకొర మిర్చికి మంచి ధర దక్కుతోంది.