ఆవు పేడతో సూట్ కేస్.. అసెంబ్లీకి హాజరు !
1 min readపల్లెవెలుగువెబ్ : ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేశ్ భగల్ బుధవారం వెరైటీ బ్రీఫ్‌కేసుతో బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యి అందరికీ షాక్ ఇచ్చారు. తాజాగా ఛతీస్‌గఢ్ సీఎం ఆవు పేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌లో బడ్జెట్ పత్రాలను తీసుకుని అసెంబ్లీకి వెళ్లారు. ఆవు పేడకు చెందిన పొడి, గమ్, పిండి, ఇతర పదార్థాలతో పాటు కొండగావ్‌కు చెందిన కళాకారులు హ్యాండిల్, కలపతో తయారు చేశారు. ఆ సూట్‌కేసుపై సంస్కృతంలో “గోమయే వసతే లక్ష్మి” అని రాసి ఉంది. అంటే దీని అర్థం “లక్ష్మి దేవత ఆవు పేడలో ఉంటుంది”. ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా, బుధవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆవుపేడతో తయారైన బ్రీఫ్‌కేస్‌తో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం భారత్‌లో ఇదే తొలిసారి. దీన్ని తయారు చేసేందుకు పది రోజులు పట్టినట్లు తెలుస్తోంది.