హోం మంత్రి రాజీనామా
1 min readముంబయి: మహరాష్ట్ర హోంమంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన తన పదవి రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి రాజీనామా లేఖను పంపించారు. ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్.. అనిల్ దేశ్ ముఖ్ మీద అవినీతి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల మీద విచారణ జరిపించాలని బాంబే హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం గమనార్హం. తన మీద వస్తున్న ఆరోపణల నేపథ్యంలోనే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల రిలయన్స్ అధినేత ముఖేష్ అంబాని నివాసం వద్ద లభించిన పేలుడు పదార్థాల కేసు సంచలనం రేపింది. సచిన్ వాజే ఈ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అనిల్ దేశ్ ముఖ్ .. సచిన్ వాజేకు ప్రతినెల వంద కోట్లు వసూలు చేయాలన్న లక్ష్యం పెట్టారని పరమ్ బీర్ సింగ్ ఆరోపించారు.