ముఖ్యమంత్రిని ఓడించిన సామాన్యుడు !
1 min readపల్లెవెలుగువెబ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓ సామాన్యుడు ముఖ్యమంత్రిని ఓడించాడు. బర్నాలా జిల్లా బదౌర్ ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం నుంచి లభ్ సింగ్ గెలుపొందారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ ఛన్నీపై 37 వేల పై చిలుకు మెజారితో ఘన విజయం సాధించారు. లభ్ సింగ్‌కు 63 వేలకు పైగా ఓట్లు తెచ్చుకోగా, ఛన్నీకి కేవలం 26 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి. 35 ఏళ్ల లభ్ సింగ్ సామాన్య కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 12 తరగతి వరకు చదువుకుని మొబైల్ రిపేర్ కంపెనీలో పనిచేస్తున్నారు. అతడి తండ్రి డ్రైవర్ కాగా, తల్లి ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. 2013లో ఆమ్ ఆద్మీ పార్టీలో వలంటీర్‌గా లభ్ సింగ్ చేరారు. తాజా ఎన్నికల్లో తనను అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచి ప్రజల మధ్య ఉంటూ ఇంటింట ప్రచారం సాగించారు. ఎమ్మేల్యేగా తనను గెలిపిస్తే దౌర్ నియోజకవర్గ ఓటర్ల సమస్యలను పరిష్కరించే బాధ్యతను భుజాన వేసుకుంటానని అని చెప్పి ప్రజల నమ్మకాన్ని పొందారు.