PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సహకార బ్యాంకుల ద్వారా రైతులకు మరింత సేవలు

1 min read

– డి సి సి చైర్ పర్సన్ మల్లెల ఝాన్సీరాణి

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు మార్చి 10, సహకార సొసైటీ బ్యాంకుల ద్వారా రైతులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇవ్వడమే కాకుండా వారి కుటుంబ ఆర్థిక స్వావలంబనకు, సహకార బ్యాంకులు ఎంతో ఉపయోగపడతాయని కడప డి సి సి బ్యాంక్ చైర్ పర్సన్, (రాష్ట్ర ఆప్కాబ్ పర్సన్ ఇంచార్జ్) మల్లెల ఝాన్సీరాణి అన్నారు, గురువారం ఉదయం సహకార సొసైటీ అధ్యక్షుడు ముది రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన చెన్నూరు సహకార బ్యాంకు లో రైతులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తమకు రైతులకు సేవ చేసేందుకు భాగ్యం కల్పించడం జరిగిందన్నారు, రైతులు పండించిన పంటతో పదిమందికి అన్నం పెట్టడం జరుగుతుంది అన్నారు, అలాంటి రైతుకు తమ వంతు బాధ్యతగా సేవ చేయడం ఎంతో భాగ్యమని భావించడం జరిగింది అన్నారు, రైతులకు ఎంత సేవ చేసినా భగవంతునికి చేసినట్లు అవుతుందని తాము భావిస్తున్నామని ఆమె తెలియజేశారు, రైతులకు సహకార బ్యాంకుల ద్వారా ఎకరాకు లక్షా యాభై వేల నుండి, మూడు లక్షల వరకు కేవలం ఏడు శాతం వడ్డీతో అంటే కేవలం 33 పైసల తో రుణాలు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు, అలాగే స్వయం సహాయ సంఘాల గ్రూపులకు, వ్యవసాయ సహకార సంఘాలకు, పై చదువుల కోసం విదేశాలకు  వెళ్లే విద్యార్థులకు చిరు వ్యాపారులకు ,కూడా రుణాలు ఇవ్వబడుతుందని ఆమె తెలియజేశారు, అదేవిధంగా పథకాల పైన జిల్లా లో అన్ని మండల లా వ్యాప్తంగా కళాజాతల ద్వారా రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు, మండలంలోని రైతులకు జె ఎల్ జి ద్వారా ( జాయింట్ లైబ్రరీ గ్రూప్) సహకార బ్యాంకుల ద్వారా మరింత సేవలు అందించేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళా రైతులకు పాడి పరిశ్రమ కు, గొర్రెలకు, సంబంధించి రుణాలుఇవ్వ పడతాయని ఆమె తెలియజేశారు, ప్రతిదీ కూడా డిజిటల్ ద్వారా రుణ సహాయం అందించ పడుతుందని ఎక్కడ అవినీతికి తావు లేకుండా , రైతులకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు, దీని ద్వారా సహకార పరపతి బ్యాంకు ద్వారా సరికొత్త మార్పులు తీసుకురావడమే కాకుండా రైతులకు మరింత సేవలు అందించేందుకు దోహదపడుతుందన్నారు, దీని ద్వారా ఈ మరింత ప్రగతి సాధించే దిశగా అడుగులు వేయడం జరుగుతుందన్నారు,

గోడౌన్ మరమ్మతులకు… లేదా కొత్త బిల్డింగ్ కు ప్రతిపాదనలు పంపండి,

చెన్నూరు కు సంబంధించి స్టేట్ బ్యాంకు దగ్గర ఉన్న సహకార గోడౌన్ ఆమె పరిశీలించారు, అనంతరం గౌడ్ న్  అభివృద్ధి కొరకు ఎస్టిమేషన్ తయారు చేసి తద్వారా, గోడౌన్ మరమ్మతులు చేయడమా, లేకపోతే కొత్తది నిర్మించి తద్వారా ఆదాయ వనరులు సమకూర్చుకోవడానికి ఏర్పాటు చేస్తామని డి సి సి బి చైర్మన్ మల్లెల ఝాన్సీ రాణి అన్నారు, ప్రతి ఒక్కరు బ్యాంక్ అభివృద్ధి కొరకు సహకరించాలని, దానిద్వారా రైతులకు మరింత సేవలు అందించడం జరుగుతుందని ఆమె అన్నారు, ఈ కార్యక్రమంలో డి సి సి బి అడ్వైజర్ యు సహదేవరెడ్డి, ఆప్కాబ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ సత్యనారాయణ, మాజీ డిసిఎంఎస్ చైర్మన్ పెడబల్లి ప్రతాపరెడ్డి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు ఎర్ర సాని మోహన్ రెడ్డి, సర్పంచ్ తుంగ చంద్రశేఖర్ యాదవ్ , ఎంపీ టీసీలు, ఎర్ర సాని నిరంజన్ రెడ్డి, సాదక్ అలీ , వ్యవసాయ సలహా మండలి సభ్యులు సంపూర్ణ రెడ్డి, బ్యాంకు సూపర్వైజర్ శివానంద రావు, రైతులు తది తరులు పాల్గొన్నారు.

About Author