NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

డా. బాబూ జగ్జీవన్​ రామ్​ జీవితం.. ఆదర్శం

1 min read
బాబు జగ్జీవన్ రామ్​ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

బాబు జగ్జీవన్ రామ్​ చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న నాయకులు

ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​.హసీనాబేగం
పల్లెవెలుగువెబ్​, కర్నూలు: స్వాతంత్ర్య సమర యోధడు, మాజీ ఉప ప్రధాని, అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషిన డా.బాబూ జగ్జీవన్​ రామ్​ జీవితం.. ప్రతిఒక్కరికీ ఆదర్శమని ఎన్​డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షురాలు ఎస్​.హసీనాబేగం అన్నారు. బాబు జగ్జీవన్​ రామ్​ 114వ జయంతిని పురస్కరించుకుని సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో డా. జగ్జీవన్​ రామ్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్​.హసీనాబేగం మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం డా.బాబు జగ్జీవన్​ రామ్​ చేసిన సేవలను ప్రతి ఒక్కరు స్మరించుకోవాన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసి తన జీవితాన్ని త్యాగం చేశారని, ఆయన ఆశయ సాధనకు, సమసమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ ఎన్.మేరీ, NWP పిఆర్ఓ సురేఖ, ఫీల్డ్ వర్కర్ సిమ్రాన్ మరియు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

About Author