20 లక్షల మంది ఆ దేశాన్ని వదిలేశారు !
1 min readపల్లెవెలుగువెబ్ : రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో 20 లక్షల మందికిపైగా ఉక్రెయిన్ ప్రజలు దేశాన్ని విడిచిపెట్టారని ఐక్యరాజ్య సమితి తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్‌లో ఇంతటి సంక్షోభం మునుపెన్నడూ లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వలసలు ప్రధానంగా పోలండ్‌కు సాగుతున్నాయని ఐరాసను ఉటంకిస్తూ ఉక్రెయిన్‌లోని సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ నివేదించింది. దీని ప్రకారం ఇప్పటి వరకు పోలండ్‌కు 1.2 మిలియన్ల మందికిపైగా వలస వెళ్లగా, హంగేరీకి 1.91 లక్షలు, స్లోవేకియాకు 1.40 లక్షలు, రష్యాకు 99 వేల మంది, మోల్దోవాకు 82 వేల మంది వలస వెళ్లినట్టు పేర్కొంది.