బంగారం స్వచ్చతను ఇలా పరీక్షించుకోండి
1 min readపల్లెవెలుగువెబ్ : బీఐఎస్ గుర్తింపు కలిగిన కేంద్రాల్లో హాల్‌మార్క్ లేని స్వర్ణాభరణాల స్వచ్ఛతను పరీక్షించుకునేందుకు సాధారణ వినియోగదారులను అనుమతిస్తున్నట్లు బీఐఎస్ అధికారిక ప్రకటన వెల్లడించింది. నాలుగు వరకు ఆభరణాల పరీక్షలకు రూ.200, ఐదు లేదా అంతకుపైగా నగలకు ఒక్కోదానికి రూ.45 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందని ప్రకటన స్పష్టం చేసింది. బీఐఎస్ గుర్తింపు కేంద్రాలు వినియోగదారుల నగల పరీక్షకు ప్రాధాన్యమివ్వడంతో పాటు వారికి బంగారం స్వచ్ఛతను ధ్రువీకరించే పరీక్ష రిపోర్టు అందించాలని ప్రకటన పేర్కొంది.