‘జగనన్న ఇళ్ల’ను త్వరగా నిర్మించండి :ఎంపీపీ డా.రాంబాబు
1 min readపల్లెవెలుగు,చింతలపూడి: మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మార్చి నెలాఖరు బడ్జెట్ మరియు అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు డాక్టర్ బాణవతు రాంబాబు అధ్యక్షతన శనివారం ఎంపీటీసీ సభ్యులతో జడ్పీటీసీ శ్రీమతి మొలుగుమాటి నీరజ సమక్షంలో సమావేశం ఏర్పాటుచేశారు,జగనన్న ఇళ్ల నిర్మాణం పనులపై యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులను (వర్కులు) పూర్తిచేయాలని ఈ మార్చి నెల ఆఖరుకు ఏ విధమైనటువంటి పెండింగ్ పనులను మిగిల్చి ఉండకూడదని సమావేశంలో సూచించారు.ఇదే కాకుండా కొత్తగ జగనన్న కాలనీలు 612 ఇల్లు శాంక్షన్ అయ్యాయని వాటిని కూడా లబ్ధిదారులకు వచ్చే వార్షిక బడ్జెట్లో నిర్మిస్తామని తెలిపారు,ఏమైనా పెండింగ్ నిధులు మిగిలి ఉంటే వాటిని తదుపరి వివిధ అభివృద్ధి పనులకు బదలాయింపు చేస్తామని తెలిపారు,ఈ పనులన్నీ స్థానిక సర్పంచులు ప్రత్యేక చొరవతో సంబంధిత అధికారుల సమన్వయంతో పనులను పూర్తి చేయించాలని ఆదేశించారు,వచ్చే వేసవిని దృష్టిలో ఉంచుకొని మండలం లో ఎక్కడ త్రాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందుబాటులోఉంటూ ఎప్పటికప్పుడు వారి వారి అవసరాలను గుర్తెరగాలన్నారు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారని. దానికి మనమంతా నడుంబిగించి ప్రజా ప్రయోజనాల నిమిత్తం ప్రజాప్రతినిధులుగా మనమంతా సమన్వయంతో అభివృద్ధి పనులను ముందుకు సాగించే విధంగా ఏకతాటిపై నడవాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి నియోజక ప్రజలకు అండగా నిలవాలని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గుత్త కిషోర్,సాధార బోయిన వరలక్ష్మి ,ఎంపీటీసీలు సర్పంచులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.