రాజీనామా యోచనలో సోనియా, రాహుల్, ప్రియాంక !
1 min readపల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ జీ23 నేతల భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లోని తమ పదవులకు రాజీనామాలు ప్రకటించనున్నట్లు సమాచారం. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ భేటీలో రాజీనామాల విషయాన్ని వారు వెల్లడించే అవకాశం ఉంది. కాగా 5 రాష్ట్రాల ఎన్నికల పరాజయాలపై చర్చించేందుకు ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా పంజాబ్‌లోనూ అధికారం పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన రెండు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు.