చికెన్ ధరలకు రెక్కలెందుకొస్తాయి..?
1 min readపల్లె వెలుగు వెబ్: చికెన్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఎండాకాలం.. చికెన్ ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. మటన్ ముక్క కావాలంటే వందలు పోయాల్సిందే. మటన్ కొనలేని వారికి.. ప్రత్యామ్నాయంగా చికెన్ ఎంతో రుచిని, పోషకాలను ఇంతకాలం అందించింది. ఇప్పుడు ఉన్నట్టుండి చికెన్ ధరలు పెరగడంతో కొనలేని స్థితిలో సామాన్యుడు ఉన్నాడు. కొన్ని ప్రాంతాల్లో చికెన్ ధర కిలో 310 రూ. అమ్ముతున్నారు. నిన్న 280 రూ. ఉన్న ధర.. ఈ రోజు 30రూ. పెరిగి 310రూ. కి చేరింది. హోల్ సేల్ గా కొందామన్న సాధ్యంకాని పరిస్థితి బహిరంగ మార్కెట్ లో నెలకొంది.
చికెన్ ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు
- ఎండలు ఎక్కువగా ఉండటం కారణంగా కోళ్ల దిగుబడి తగ్గడం.
- ఎండ తీవ్రత కారణంగా కోళ్లు చనిపోతున్నాయి. గ్రోత్ తగ్గుతోంది.
- చికెన్ కు డిమాండ్ పెరగడం.
- డిమాండ్ పెరిగినపుడు.. సరఫరా తగ్గితే.. ధరలు పెరుగుతాయి.