వృద్ధులకు, వికలాంగులకు ‘అవోపా’ చేయూత
1 min readకర్నూలు: అవోపా కర్నూలు వారి ఆధ్వర్యంలో యోజన ఆసరా కార్యక్రమం కింద దివంగత కాల్వ సూర్యనారాయణ గుప్త కుటుంబ సభ్యులు అందించిన ఆర్థిక సహకారంతో ఆదివారం ఉదయం గోశాల ప్రాంగణంలో 110 మంది ఆర్యవైశ్య వృద్ధులు వికలాంగులు, వితంతువులకు ఒక్కొక్కరికి 600-00 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమైనది. ఈ కార్యక్రమానికి సంస్థ అధ్యక్షులు శ్రీ గోనూరు యుగంధర్ శెట్టి అధ్యక్షత వహించగా దాతలు కాల్వ ప్రసాద్ చేతుల మీదుగా సరుకులను పంపిణీ చేయడమైనది. ఈకార్యక్రమంలో సంస్థ రాష్ట్ర కార్యదర్శి టి వి రత్న ప్రసాద్ , చీఫ్ కన్వీనర్ మలిపెద్దు నాగేశ్వరరావు, కార్యదర్శి పోలేపల్లి శేషయ్య, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్. అవినాష్ శెట్టి సభ్యులు పుల్లా ఆంజనేయులు, చిన్ని పాండురంగ, నాగెళ్ళ హరికిషన్, విష్ణువర్ధన్ గుబ్బా వెంకటరమణ నాగరాజు, రామ లక్ష్మయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.