పెండింగ్ ఈ– చలాన్లు చెల్లించాలి…
1 min readకర్నూలు: ట్రాఫిక్ నిబంధలు ఉల్లింఘించి … జరిమానాలు విధింపడిన వాహనదారుల వాహనాలకు సంబంధించిన చెల్లించని పెండింగ్ ఈ-చలాన్ లు చెల్లించాలని కర్నూల్ ట్రాఫిక్ పోలీసు వారు ఆదివారం ఒక ప్రకటనలో సూచించారు. టూ, త్రీ, ఫోర్ వీలర్ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో కర్నూలు పోలీసులు ఈ-చలాన్ ద్వారా జరిమానాలు విధించారని తెలిపారు. పెండింగ్ చలాన్ల చెల్లింపునకు గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, ఆన్‌లైన్, మీ సేవ లను ఉపయోగించుకుని చెల్లించవచ్చని సూచించారు. కర్నూల్ పట్టణంలో రోడ్డు ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో, కర్నూల్ నగర ట్రాఫిక్ రద్దీని క్రమబద్దీకరించడంకు గాను కర్నూలు నగరంలోకి హెవీ వెహికల్స్ (భారీ వాహనాలు) ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు కర్నూలు పట్టణంలోకి అనుమతి లేదు. ప్రవేశ (Entry) సమయం మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు, రాత్రి 9 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు మాత్రమే కర్నూలు పట్టణంలోకి ప్రవేశ(Entry) సమయం ఉంటుంది. ఈ విషయాన్ని గమనించాలని తెలిపారు. కర్నూల్ పట్టణంలో తిరిగే వాహనాలకు, వాహనదారులు తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్ లను త్వరగా చెల్లించుకుని పోలీసులకు సహకరించాలని, కర్నూలు ట్రాఫిక్ పోలీసు వారు విజ్ఞప్తి చేశారు.