లాభాల్లో స్టాక్ మార్కెట్
1 min readపల్లెవెలుగువెబ్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. రష్యా, ఉక్రెయిన్ యుద్ధ అనిశ్చితి తొలగనప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఐరోపా సూచీలు కూడ లాభాల్లో ప్రారంభమయ్యాయి. ప్రధానంగా బ్యాంకింగ్ సెక్టార్, ఆటో, ఐటీ సెక్టార్లలో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ 240 పాయింట్ల లాభంతో 16871 వద్ద, సెన్సెక్స్ 935 పాయింట్ల లాభంతో 56486 వద్ద ముగిశాయి.