కిడ్నీలో రాళ్లు ఏర్పడకూడదంటే..?
1 min readపల్లె వెలుగు వెబ్: ఎండకాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి అవకాశం ఎక్కువ. మూత్రనాళ ఇన్ఫెక్షన్లుకు కూడ దారితీస్తాయి. వేసవిలో జాగ్రత్తగా లేకపోతే చాలా ఇబ్బందిపడతారు. వేసవిలోని ఉష్ణం మూత్రశయ వ్యవస్థని దెబ్బతీస్తుంది. కాబట్టి ఎండకాలం కొన్న జాగ్రత్తలు పాటిస్తే.. ఈ సమస్యలను దూరంపెట్టవచ్చు.
ఏం చేయాలి..?
- నీటిని అధికంగా తీసుకోవాలి. ఫలితంగా డీహైడ్రేషన్ సమస్య రాదు.
- సమతుల ఆహారం తీసుకోవాలి.
ఏం చేయకూడదు..?
-మాంసం, ఉప్పు తగ్గించాలి. - నీటికి బదులు కూల్ డ్రింక్స్ తాగకూడదు.
- రాత్రి పూట బాదం, జీడిపప్పు తగ్గించాలి.
- మాత్రల రూపంలో కాల్షియం శరీరంలోకి చేరితే.. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
- డీప్ ప్రైడ్ ఆహారం తగ్గించాలి. నూనె పధార్థాలు అధికంగా వాడకూడదు.
పై విధంగా సమతుల ఆహారం తీసుకుని, నీటిని ఎప్పటికప్పడు శరీరానికి ఇస్తే.. ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.