హిజాబ్ పై హైకోర్టు సంచలన తీర్పు
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటక రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లను కర్ణాటక హైకోర్టు మంగళవారం కొట్టి వేసింది.‘‘ముస్లిం మహిళలు హిజాబ్ ధరించడం ఇస్లాం ప్రకారం ముఖ్యమైన మతపరమైన ఆచారంలో భాగం కాదు. పాఠశాల యూనిఫాం ధరించడం సహేతుకమైన పరిమితి మాత్రమే, దీనిని విద్యార్థులు అభ్యంతరం చెప్పలేరు. యూనిఫాం ధరించడంపై జీవో జారీ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది’’ అని హైకోర్టు పేర్కొంది.