తూర్పుగోదావరిలో ప్రపంచంలోనే రెండో విషపూరిత చేప !
1 min readపల్లెవెలుగువెబ్ : తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం వాసాలతిప్పలో మనిషి ముఖంతో పోలిన రూపంతో ఉన్న అరుదైన చేప మత్స్యకారులకు చిక్కింది. సోషల్ మీడియాలో ఈ చేప వైరల్‌గా మారింది. విచిత్రం ఏమిటంటే.. తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్‌లా ఉబ్బుతుంది. అందుకే దీన్ని బెలూన్ ఫిష్ అని కూడా పిలుస్తారు. ఈ చేపను బొంక చేప, బెలూన్ ఫిష్, గ్లోబ్ ఫిష్ తదితర పేర్లతోనూ పిలుస్తారు. ఇది చూసేందుకు మూములుగానే ఉంటుంది. కానీ తనకు ప్రమాదం ఉందని భావిస్తే మాత్రం గాలి పీల్చుకొని బెలూన్‌లా మారిపోతుంది. అందుకే బెలూన్ ఫిష్ అంటారు. చేప అలా ఉబ్బిపోగానే.. దాన్ని తినడానికి వచ్చిన జీవులు వెంటనే అక్కడి నుంచి భయంతో పారిపోతాయి.