జనంలో ఉండాల్సిందే.. జగన్ దిశానిర్దేశం
1 min readపల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్షం సమావేశం ముగిసింది. అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ భేటీలో రాబోయే ఎన్నికలకు సమాయత్తంపై పార్టీ శ్రేణులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, బూత్ కమిటీల ఏర్పాటుపై సీఎం జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఒక్కో గ్రామ సచివాలయానికి రెండు రోజులు వెళ్లాలని చెప్పారు. ప్రతిరోజు నివేదికను తెప్పించుకుని సమీక్షిస్తామన్నారు. క్యాడర్ ను ప్రజలకు దగ్గర చేయాలని, బూత్ కమిటీలను బలోపేతం చేయాలని తెలిపారు. కమిటీల్లో సగం మంది మహిళలు ఉండాలన్నారు. ఎమ్మెల్యేలు నిత్యం ప్రజల్లో ఉండాలని, ఆ మేరకు కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు.