భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు పై 7.3 !
1 min readపల్లెవెలుగువెబ్ : జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. దీని ప్రభావంతో జపాన్ రాజధాని టోక్యోతోపాటు వివిధ ప్రాంతాల్లో ఇళ్లు కంపించాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులయ్యారు. సుమారు 20లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం రాత్రి 11.36 గంటలకు సముద్రతీర ప్రాంతమైన ఫుకుషిమాలో భూమి కంపించింది. భూ ఉపరితలానికి 60 కిలోమీటర్ల లోతున ప్రకంపనల కేంద్రాన్ని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. కాగా సునామీ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నప్పటికీ అంద రూ అప్రమత్తంగా ఉండాలని, తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని హెచ్చరించారు.