భారత్ -బంగ్లాదేశ్ మధ్య రైలు సర్వీసులు !
1 min readపల్లెవెలుగువెబ్ : భారత రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియా- బంగ్లాదేశ్ దేశాల మధ్య రైళ్ల సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. భారతదేశం, బంగ్లాదేశ్ మధ్య మైత్రీ ఎక్స్‌ప్రెస్, బంధన్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులు మార్చి 26 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నిర్ణయం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ క్లియరెన్స్‌కు లోబడి ఉంటుందని రైల్వే శాఖ తెలిపింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా రెండు దేశాల మధ్య రైలు సేవలు మార్చి 2020లో నిలిపివేయబడ్డాయని రైల్వే శాఖ పేర్కొంది.