ఉక్రెయిన్ అధ్యక్షుడికి నోబెల్ శాంతి బహుమతి ?
1 min readపల్లెవెలుగువెబ్ : యూరోపియన్ రాజకీయవేత్తలు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేరును నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేస్తున్నారు. ఈ మేరకు నార్వేకు చెందిన నోబెల్ శాంతి కమిటీకి విజ్ఞప్తులు పంపిస్తున్నారు. శాంతి బహుమతి కమిటీకి మేం వినమ్రంగా మా విజ్ఞప్తిని పరిశీలనలోకి తీసుకోమని కోరుతున్నాం. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతోపాటు ఉక్రెయిన్ ప్రజలనూ శాంతి బహుమతికి మేం నామినేట్ చేస్తున్నాం. ఈ కారణం వల్లనే నామినేషన్ల స్వీకరణను తిరిగి తెరవాలని, మార్చి 31వ తేదీ వరకు స్వీకరణ తేదీని పొడిగించాలని కోరుతున్నాం అని ఆ ప్రకటనలో ఉంది.