వివేకా హత్య కేసు.. ఉమాశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ వాయిదా
1 min readపల్లెవెలుగువెబ్ : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏ-3 నిందితుడైన గజ్జల ఉమాశంకర్‌రెడ్డి బెయిల్ పిటీషన్ 23వ తేదీకి వాయిదాపడింది. ఈనెల 3వ తేదీన ఉమాశంకర్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై 4, 10 తేదీలలో విచారణ జరిగింది. తన క్లయింట్ ఉమాశంకర్‌రెడ్డి మానసికంగా, శారీరకంగా తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారని దీనిని కోర్టు పరిగణించి బెయిల్ మంజూరు చేయాలని పిటీషనర్ తరుపు న్యాయవాది కోరారు.