రష్యా పై ఒత్తిడి విషయంలో భారత్ బలహీనంగా ఉంది !
1 min readపల్లెవెలుగువెబ్ : అమెరికా అధ్యక్సుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ పై రష్యా సాగిస్తున్న దమనకాండను వ్యతిరేకించడంలో భారత్ బలహీనంగా ఉందని అన్నారు. అమెరికా మిత్రదేశాలన్నీ ఐక్యంగా ఉంటూ రష్యా పై ఒత్తిడి తెస్తుంటే.. ఢిల్లీ మాత్రం అస్థిరంగా, బలహీనంగా స్పందిస్తోందని అన్నారు. నాటో కూటమిని విభజించగలనన్న పుతిన్ లెక్కలు తప్పాయని బైడెన్ అన్నారు. గతంలో కంటే బలంగా నాటో కూటమి తయారైందని, ఇదంతా రష్యా వల్లే జరిగిందన్నారు. సీఈవోలతో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.