జగన్.. బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు !
1 min read
పల్లెవెలుగువెబ్ : ఏపీ అసెంబ్లీలో సీఎం జగన్ గురించి మంత్రి గుమ్మనూరు జయరాం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు అంటూ స్తుతించారు. గతంలో యుగపురుషుడి గురించి మాట్లాడానని, అప్పడు భజన అని తనను అందరూ అన్నారని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈసారి భజన చేయడం లేదన్నారు. మనస్సునుండి వచ్చింది చెపుతున్నానని ఆయన పేర్కొన్నారు. దీంతో మంత్రి జయరాం వ్యాఖ్యలపై స్పీకర్ ప్రశ్న వేశారు. అసలు ముఖ్యమంత్రి బ్రహ్మ, విష్ణువా, మహేశ్వరుడా..అని స్పీకర్ ప్రశ్నించారు. ఆ ముగ్గురు అని మంత్రి ముసిముసిగా నవ్వుతూ చెప్పారు.