PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విభ‌జ‌న‌.. అప్పుడు జిన్నా చేసిందే ఇప్పుడు బీజేపీ చేస్తోంది

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పీడీపీ అధినేత్రి మెహ‌బూబా బీజేపీ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ‘‘గతంలో మహ్మద్ అలీ జిన్నా ఈ దేశాన్ని రెండుగా విడదీశారు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ అదే ప్రయత్నం చేస్తోంది’’ అని పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత మెహబూబా ముఫ్తీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ఫైల్స్ సినిమాపై తీవ్ర వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇదే విషయమై ముఫ్తీ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయులను మతాలుగా విడగొట్టి దేశాన్ని ముక్కలు చేయాలని చూస్తున్నారంటూ ఆమె నిప్పులు చెరిగారు.

                                      

About Author