సాగు చట్టాల రద్దు సరికాదు !
1 min readపల్లెవెలుగువెబ్ : కొత్త సాగు చట్టాలపై సుప్రీం కోర్టు నియమించిన కమిటీ.. కేంద్రం ఆ చట్టాలను పూర్తిగా తొలగించడం సరికాదని అభిప్రాయపడింది. ఈ చట్టాలను తొలగించడం లేదా ఎక్కువకాలం పాటు అమలు చేయకుండా ఉండడం.. వీటిని సమర్థించే మెజారిటీ ప్రజల పట్ల అన్యాయమేనని పేర్కొంది. సాగు చట్టాలను పూర్తిగా రద్దు చేసే బదులు నిర్ణీత ధరలకు రైతుల పంటలను సేకరించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని, అలాగే నిత్యావసర సరుకుల చట్టాన్ని తొలగించాలని ఆ కమిటీ సూచించింది. ఆ కమిటీలోని ఒక సభ్యుడు.. పుణెకు చెందిన రైతు నేత అనిల్ ఘన్‌వట్ ఈ విషయాన్ని వెల్లడించారు.