PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్నికల సరళిని కంట్రోల్​ రూం నుంచి పరిశీలిస్తున్న కలెక్టర్​వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీలు రాం సుందర్​ రెడ్డి, ఖాజా మొహిద్దీన్​,

ఎన్నికల సరళిని కంట్రోల్​ రూం నుంచి పరిశీలిస్తున్న కలెక్టర్​వీరపాండియన్​, ఎస్పీ ఫక్కీరప్ప, జేసీలు రాం సుందర్​ రెడ్డి, ఖాజా మొహిద్దీన్​,

అమ‌రావ‌తి: ఆంధ్రప్రదేశ్ లో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల పోలింగ్ మొద‌లైంది. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌రకు పోలింగ్ జ‌ర‌గ‌నుంది. 7,220 ఎమ్పీటీసీ స్థానాల‌కు, 560 జ‌డ్పీటీసీ స్థానాల‌కు పోలింగ్ జ‌రుగుతోంది. స‌మ‌స్యాత్మక ప్రాంతాల‌ను, అత్యంత స‌మ‌స్యాత్మక ప్రాంతాల‌ను పోలీసులు గుర్తించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కే పోలింగ్ పూర్తీ చేసి.. బ్యాలెట్ బాక్సుల‌ను స్ర్టాంగ్ రూంకు త‌ర‌లించ‌నున్నారు.


పోలింగ్ కేంద్రాల్లో కోవిడ్ నిబంధ‌న‌లు:

  • ఓట‌ర్లు మాస్క్ తో పోలింగ్ కేంద్రంలోకి వెళ్లాలి
  • థ‌ర్మల్ స్క్రీనింగ్ త‌ర్వతే పోలింగ్ స్టేష‌న్ లోకి అనుమ‌తిస్తారు.
  • కోవిడ్ పాజిటివ్ ఉన్నవారికి పీపీఈ కిట్లు అందిస్తారు. చివ‌రి గంట‌లో వారిని పోలింగ్ కు అనుమ‌తిస్తారు.
    వెబ్ కాస్టింగ్ ద్వార ప‌ర్యవేక్షణ‌:
    మ‌వోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, స‌మ‌స్యాత్మక‌, అత్యంత స‌మ‌స్యాత్మక ప్రాంతాల్లో వెబ్ కాస్టింగ్ ద్వార ప‌ర్యవేక్షిస్తారు. ఇప్పటికే సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. క‌మాండ్ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రక్రియ‌కు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తీ చేశామ‌ని పంచాయ‌తీరాజ్ సెక్రట‌రీ గోపాల‌కృష్ణ ద్వివేది ప్రక‌టించారు.
    ఓట్ల లెక్కింపునకు బ్రేక్ ?
    ప‌రిష‌త్ ఎన్నిక‌ల పూర్తీ అయినా స‌రే.. ఓట్ల లెక్కింపులో మాత్రం ఆల‌స్యం జ‌ర‌గ‌నుంది. హైకోర్టు నుంచి అనుమ‌తి వ‌చ్చే వ‌ర‌కు ఓట్ల లెక్కింపు జ‌ర‌గ‌దు. ఇప్పటికే ఎన్నిక‌ల ఏర్పాట్లు పూర్తయిన నేప‌థ్యంలో హైకోర్టు పోలింగ్ కు అనుమ‌తించింది. కానీ.. సింగిల్ బెంచ్ జ‌డ్జీ తీర్పు పూర్తీగా వెలువ‌డే వ‌రుకు ఎన్నిక‌ల ఫ‌లితాలు ఆల‌స్యం అవుతాయి.

About Author