సెన్సోడైన్ టూత్ పేస్ట్ కు భారీ జరిమానా.. ప్రకటనలు ఆపండి !
1 min readపల్లెవెలుగువెబ్ : ప్రముఖ టూత్‌పేస్ట్ ఉత్పత్తుల సంస్థ సెన్సోడైన్ పై సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ అసహనం వ్యక్తం చేసింది. కొద్ది రోజులగా టీవిలో ప్రసారం అవుతున్న ప్రకటనలను 7 రోజుల్లోగా వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే, ప్రజలను తప్పుదారి పట్టించినందుకు సంస్థపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ మేరకు నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సోడైన్ సంస్థ తమ ఉత్పత్తుల ప్రచారం కోసం ఒక ప్రకటనలో.. ‘ప్రపంచవ్యాప్తంగా దంతవైద్యులు సిఫార్సు చేస్తున్న టూత్‌పేస్ట్ సెన్సోడైన్’, ‘ప్రపంచ నంబర్ 1 సెన్సిటివిటీ టూత్‌పేస్ట్’ అని వచ్చిన వ్యాఖ్యలపై సీసీపీఏ అభ్యంతరం వ్యక్తం చేసింది.