అంతర్జాతీయ ప్రతికూలత.. నష్టాల్లో సూచీలు
1 min readపల్లెవెలుగువెబ్ : భారత స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు కొద్ది సేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత అదే బాటలో చివరి వరకు కొనసాగాయి. అమెరికాలో వడ్డీరేట్ల పెంపు, ద్రవ్యోల్బణ భయాలు, ముడి చమురు ధరల పెరుగుదల, దేశీయంగా ఇంధన రిటైల్ ధరల పెంపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం.. వంటి ప్రతికూల పరిణామాలతో మదుపరులు ఆచీ తూచీ అడుగులు వేశారు. దీంతో, సూచీలు నేడు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 304 పాయింట్ల నష్టంతో 57,684 వద్ద, నిఫ్టీ 69 పాయింట్ల నష్టంతో 17,245 వద్ద ముగిసింది.