ఓటింగ్.. ప్రశాంతం..
1 min read– రెండో దశ జీపీ ఎన్నికల క్యూ కట్టిన ఓటర్లు
– ఎన్నికల ప్రక్రియను పరిశీలిస్తున్న జనరల్ అబ్జర్వర్ సీనియర్ ఐఏఎస్ ఎం.ఎం నాయక్
పల్లెవెలుగు, కర్నూలు కలెక్టరేట్;
కర్నూలు జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. శనివారం ఉదయం నుంచి ఓటర్లు భారీ క్యూ కట్టారు. కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, డోన్ సబ్ డివిజన్ పరిధిలోని ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా, నిర్భయంగా వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రం ఆవరణలో వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతుంటే… పోలీసు సిబ్బంది సహకరించారు. ఎన్నికల ప్రక్రియను జనరల్ అబ్జర్వర్ సీనియర్ ఐఏఎస్ ఎం.ఎం నాయక్, జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అథారిటీ జి.వీరపాండియన్, జిల్లా ఎస్పీ డా.కె.ఫక్కీరప్ప, జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు అభివృద్ధి) రామసుందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్ ఖాజా మోహిద్దీన్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ నిధి మీన, జిల్లా 19 నోడల్ కమిటీల అధికారులు ఎప్పటికప్పుడు కలెక్టరేట్లోని ఎన్నికల కంట్రోల్ రూమ్/వార్ రూమ్ నుండి వెబ్ కాస్టింగ్ ద్వారా, పోలీసు వైర్ లెస్ సెట్స్ ద్వారా పర్యవేక్షించారు.