భార్య సినిమా చూస్తానంటే.. థియేటర్ నే బుక్ చేశాడు !
1 min readపల్లెవెలుగువెబ్ : పాకిస్థానీ నటుడు మునీబ్ భట్‌కు తన భార్య ఆయుమాన్ అంటే ఎంతో ప్రేమ. ప్రస్తుతం వీరు తమ చిన్నారి కూతురు అమల్‌తో కలసి దుబాయ్ ట్రిప్‌లో ఉన్నారు. అలియా భట్ నటించిన ‘గంగూబాయి కతియావాడి’ చిత్రం చూడాలనే కోరికను తన భార్య వ్యక్తం చేయడంతో, దుబాయ్‌లో ఓ థియేటర్ మొత్తం బుక్ చేశాడు మునీబ్. మిగిలిన ప్రేక్షకులు ఎవరూ లేకుండా భార్యతో కలసి హ్యాపీగా సినిమా చూడడం కోసం ఖర్చుకు అతను వెనుకాడలేదు. ఈ సందర్భంగా ఓ చిన్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.