యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో చెప్పిన ఉక్రెయిన్ !
1 min readపల్లెవెలుగువెబ్ : ఉక్రెయిన్ ఆర్మీ ఆసక్తికర ప్రకటన చేసింది. ఈ యుద్ధాన్ని రష్యా మే 9వ తేదీన ముగించాలని భావిస్తోందని ఉక్రెయిన్ ఆర్మీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ తేదీనే ఎందుకనే దానికీ ఒక ప్రత్యేకత ఉంది. నాజీ జర్మనీపై తమ విజయానికి గుర్తుగా ఆరోజు రష్యా ‘విక్టరీ డే’ పేరుతో దేశవ్యాప్తంగా సంబురాలు జరుపుతుంటుంది. కాబట్టి, అదే రోజున ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించి.. ప్రకటన చేసుకునే అవకాశం ఉందని ఆర్మీ అంచనా వేస్తోంది. విక్టరీ డే అనేది 1945లో గ్రేటర్ జర్మన్ రీచ్ లొంగిపోయినందుకు గుర్తుచేసే సెలవుదినం. ఈ మేరకు ఉక్రెయిన్ ఆర్మ్‌డ్ బలగాల్లోని జనరల్ స్టాఫ్ ఇంటెలిజెన్స్ విభాగపు సమాచారం ప్రకారం ఉక్రెయిన్ ఆర్మీ ఈ ప్రకటన విడుదల చేసినట్లు.. ది కీవ్ ఇండిపెండెట్ మీడియా హౌజ్ ట్వీట్ చేసింది.