PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పది రోజుల్లో రైతులకు రుణాలు:సొసైటీ చైర్మన్​ వెంకట సుబ్బారావు

1 min read

పల్లెవెలుగు వెబ్​,ఏలూరు:  పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి సొసైటీ ద్వారా దరఖాస్తు చేసుకున్న 10 రోజులలోపే రైతులకు వ్యవసాయ రుణాలు అందిస్తున్నామని పెదవేగి సొసైటీ చైర్ పర్సన్ పెనుమాక వెంకటసుబ్బారావు అన్నారు. సొసైటీ సర్వసభ్య సమావేశం చైర్ పర్సన్ అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం జరిగింది.ఈ సమావేశంలో చైర్ పర్సన్ సుబ్బారావు మాట్లాడుతూ 2021- 2022 ఆర్థిక సంవత్సరానికి గాను సొసైటి ద్వారా నాలుగు వందలు నుండి ఐదు వందలు మంది రైతులకు రుణాలు అందించామని చెప్పారు, గతంలో ఇదే సొసైటీ లో రుణాలు పొందాలంటే రైతులకు సుమారు మూడు మాసాల సమయం పట్టేది అని అన్నారు.ఈ ఆర్థిక ఏడాదిలో ఎనిమీది మంది సభ్యులకు కొత్తగాసభ్యత్వంఇచ్చామన్నారు.వారికి కూడా త్వరలో రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పారు. సొసైటీలో ఉన్న రైతుల డిపాజిట్లకు అధిక వడ్డీ అందజేస్తామని చైర్ పర్సన్ వివరించారు.సొసైటీ లాభాల బాటలో ఉందని చెప్పారు. సొసైటీ సిబ్బంది సేవలను చైర్ పర్సన్ సుబ్బారావు ప్రశంసించారు.ఋణాల కొరకు వచ్చిన రైతుల కు సిబ్బంది సకాలంలో స్పందించి రుణ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారని చెప్పారు.గత ఏడాది సొసైటి ద్వారా  ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయడం ద్వారా  సొసైటీకి సుమారు ముపై ఆరు లక్షల కమీషన్ ప్రభుత్వంనుండి రావాల్సి వుందని అన్నారు.ఈ సమావేశం లో దెందులూరు ఏ ఎం సి చైర్మన్ మేకా లక్ష్మణరావు మాట్లాడుతూ రైతులు సొసైటీ ద్వారా అందించే రుణాలు సద్వినియోగం చేసుకుని సొసైటీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. ముందుగా సొసైటీ కార్యదర్శి టి ఎస్ ఆర్ మూర్తి సొసైటీ వార్షిక బడ్జెట్ రుణాలు.రికవరీ ఖర్చులు జమలువంటి వివరాలు సభ్యులకు చదివి వినిపించారు.ఈ కార్యక్రమంలో సొసైటీ పర్సన్ ఇంచార్జ్ లు ఎం వసంతారావు,కొనకళ్ల విజయలక్ష్మి  రైతులు పాల్గొన్నారు.

About Author