ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. ముగ్గురు తమిళ కూలీలు అరెస్ట్
1 min readపల్లెవెలుగు వెబ్, రాయచోటి: ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు తమిళ కూలీలను అరెస్టు చేసి వారి వద్ద ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. రాజంపేట DFO శ్రీ Y. వెంకట నరసింహ రావు గారి ఆదేశాల మేరకు సానిపాయ రేంజ్ ఆఫీసర్ శ్రీ కె. పీరయ్య గారి ఆధ్వర్యంలో గురువారం తెల్లవారు జామున 4.50 AM గంటలకు వానారాచపల్లి బీట్ లో ఏనుబోతు రస్తా దగ్గర తనిఖీ చేస్తుండగా… కొందరు తమిళ కూలీలు తారస పడ్డారు. వారిలో తమిళనాడు లోని విల్లుపురం జిల్లాకు చెందిన .K. గోవింద రాజు , తంగ రాజు , .మత్తీ అనే ముగ్గురు ముద్దయిలని అరెస్ట్ చేసి 93KGల మూడు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు FRO పీరయ్య తెలిపారు. 93KGల దుంగలు విలువ రూ.39,406 ఉంటుందన్నారు. ఎర్రచందనం అక్రమరవాణాపై స్ట్రైక్ ఫోర్స్ మరియు బేస్ క్యాంపు లతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా పై PD act నమోదు చేస్తామని హెచ్చరించారు ఎర్ర చందనం అక్రమ రవాణా పై ప్రజలకు సమాచారం తెలిసిన యెడల వెంటనే మాకు తెలియజేయండి అని సానిపాయ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీ కె. పీరయ్య తెలిపారు ఈ తనికీలలో DRO వెంకటశేషయ్య, FBO లు T.సాయి కృష్ణ,. G. అనిల్ కుమార్ ,P.లీల శ్రీ హరి,K. రమేష్, స్ట్రైక్ ఫోర్స్ మరియు బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.