సెబ్ సిఐ, సిబ్బందిపై సారా వ్యాపారుల దాడి
1 min read–సిఐ, కానిస్టేబుళ్ళుకు తీవ్ర గాయాలు
– ఆస్పరి పీఎస్ లో కేసు నమోదు
ఆస్పరి: కర్నూలు జిల్లా ఆలూరు ఎక్సైజ్ పోలీసులపై సారా వ్యాపారులు దాడి చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో బిల్లేకల్లు గ్రామంలో నాటుసారా బట్టీలు నిర్వహిస్తూ అక్రమంగా నాటుసారా అమ్ముతున్నారని సమాచారం మేరకు దాడులుకు వెళ్ళిన ఎక్సైజ్ సిఐ, పోలీసులపై నాటు సారా తయారీ దారులు దాడులకు తెగబడ్డారు. ఆలూరు ఎక్సైజ్ సీఐ వెంకట్ కు, కానిస్టేబుళ్ళుకు గాయాలయ్యాయి. వివరాల మేరకు.. మండల పరిధిలోని బిల్లేకల్లు గ్రామంలో నాటుసారా బట్టీలు నిర్వహిస్తూ అక్రమంగా నాటుసారా అమ్ముతున్నారని సమాచారం మేరకు ఆలూరు సెబ్ పోలీసు అధికారులు శనివారం తెల్లవారుజామున ఈగ పెద్ద పెద్దయ్య ఇంటిదగ్గర తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10 లీటర్ల నాటుసారా పట్టుకుని సీజ్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఈడిగా పెద్ద పెద్దయ్య, ఈడిగ ఈరన్న, ఈడిగా నాగరాజు తో పాటు మహిళలందరూ కలిసి ఆలూరు ఎక్సైజ్ సిఐ వెంకట్ సిబ్బందిపై కత్తులతో దాడిచేసి గాయపరిచడం చేయడం జరిగిందన్నారు. అక్కడ జరిగిన సంఘటనను ఎక్స్చేంజ్ పోలీసులు మొబైల్ ఫోన్ లో వీడియోలు తీస్తుండగా పోలీసు వారి వద్ద నుండి మొబైల్ ఫోన్, పది లీటర్ల సారాను లాక్కుపోయారని ఆలూరు ఎక్స్చేంజ్ సీఐ వెంకట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆలూరు సీఐ ఈశ్వరయ్య తెలిపారు.