కరోన కాలర్ ట్యూన్లు.. ఇక వినపించవు !
1 min readపల్లెవెలుగువెబ్ : `నమస్కారం.. కొవిడ్-19 అన్‌లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతటా మొదలైంది. ఇలాంటి సమయంలో అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి వెళ్లకండి’ అంటూ ప్రతి మొబైల్ లో వినిపించే కాలర్ ట్యూన్ ఇక మూగబోనుంది. దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోకి వచ్చిన తరుణంలో కొవిడ్ కాలర్ ట్యూన్లకు స్వస్తి పలకాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈమేరకు టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో గత 21 నెలలుగా ఫోన్లలో వింటున్న కొవిడ్ కాలర్ ట్యూన్లకు కాలం చెల్లినట్లయింది. ‘‘ఆ కాలర్ ట్యూన్ల లక్ష్యం నెరవేరింది.. ఇకనైనా తొలగించండి’’ అంటూ సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీవోఏ), మొబైల్ వినియోగదారుల నుంచి కేంద్ర టెలికాం విభాగానికి విజ్ఞప్తులు వెల్లువెత్తాయి.