క్యాన్సర్ పై ఏపీ ప్రభుత్వం యుద్ధం
1 min readపల్లెవెలుగువెబ్ : క్యాన్సర్ మహమ్మారిపై ఏపీ ప్రభుత్వం యుద్ధానికి సన్నద్ధమైంది. క్యాన్సర్ వైద్యం, నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టిసారించింది. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడంవల్ల నివారణకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా.. ప్రాణాపాయంతో పాటు, వైద్యానికయ్యే ఖర్చు కూడా తగ్గుతుంది. ఈ నేపథ్యంలో.. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రాష్ట్రంలో మాస్ స్క్రీనింగ్‌కు ప్రభుత్వం నడుం బిగించింది. దీనిద్వారా నోటి క్యాన్సర్‌తో పాటు మహిళల్లో అధికంగా వచ్చే గర్భాశయ ముఖద్వార , రొమ్ము క్యాన్సర్లను ప్రారంభ దశలో గుర్తించి చికిత్స అందించాలనేది సర్కారు లక్ష్యం. ఈ మేరకు గుంటూరు జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది. స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించింది.