భక్తులకు అవస్థలు.. చిరువ్యాపారులకు కాసులు…
1 min readపల్లెవెలుగు వెబ్ : ఉగాది పర్వదినం పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు కాలినడకన శ్రీశైలం పుణ్యక్షేత్రానికి చేరుకుంటున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ తోపాటు పలు రాష్ట్రాల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులకు శ్రీశైల దేవస్థానం సకల సౌకర్యాలు కల్పిస్తోంది. కానీ కొందరు దేవస్థానం సిబ్బంది నిర్వాకం కారణంగా భక్తులకు ఇబ్బందులకు గురవుతున్నారు. పుణ్యక్షేత్రంలో ఎండ, వాన నుంచి భక్తుల రక్షణ కోసం .. దాతలు, భక్తుల సొమ్ముతో ఫుట్‌పాత్‌లు, షెడ్లు నిర్మించారు. కానీ దేవస్థానం రెవెన్యూ సిబ్బంది తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఆలయ సమీపంలోని లడ్డూ కేంద్రం నుంచి దాతలు (డొనేషన్) కేంద్రం సమీపం వరకు దుకాణదారులు ఫుట్‌పాత్‌లపై ముందుకు వచ్చారు. పాతాళగంగ, లలితాంబిక సమీపంలోనూ ఇదే పరిస్థితి. దీంతో కన్నడ భక్తులు తారు రోడ్డుపై ఎండలో నడుచుకు వెళ్లాల్సివస్తోంది.