విమానంలో ఆహారం ఎందుకు రుచిగా ఉండదో తెలుసా ?
1 min readపల్లెవెలుగువెబ్ : విమానంలో తినే ఆహారం రుచిగా ఉండకపోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. ఈ విషయాన్ని అమెరికన్ న్యూస్ నెట్ వర్క్ చెడ్డార్ వెల్లడించింది. ఆహారంపై చెడ్డార్‌కు చెందిన పాట్రిక్ జోన్స్ తెలిపిన వివరాల ప్రకారం తేమ తగ్గుదల ప్రభావం విమానాలలో మరింతగా కనిపిస్తుంది. విమానం లోపల గాలిలో 20% తేమ మాత్రమే ఉంటుంది. తేమ తగ్గుదల ఆహారంపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల ఆహారం పొడిబారిపోతుంది. ఫలితంగా ఆ ఆహారం రుచికరంగా అనిపించదు. వాసన చూసే సామర్థ్యం ఇలాగే ఉంటుంది. గాలిలోని తేమను బట్టి మన వాసనా శక్తి పనిచేస్తుందని ప్యాట్రిక్ తెలిపారు. గాలిలో తేమ లేకపోతే రుచి చూడటంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అంతేగానీ విమానయాన సంస్థ.. ప్రయాణీకులకు చెడు ఆహారం ఇవ్వదు. విమానాలలో వాసన చూసే సామర్థ్యం తక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. అందుకే విమానంలోని ఆహారాన్ని ఎంత రుచికరంగా చేసినా ప్రయాణీకులకు రుచిగా అనిపించదు.