ఆ పరీక్షలకు 20 వేల మంది విద్యార్థులు వెళ్లలేదు.. ఎందుకంటే ?
1 min readపల్లెవెలుగువెబ్ : కర్ణాటక వ్యాప్తంగా ప్రారంభమైన ఎస్‌ఎస్ఎల్‌సీ పరీక్షల తొలిరోజు ఏకంగా 20 వేల మందికి పైగా విద్యార్థులు గైర్హాజరయ్యారు. వీరిలో అత్యధికమంది హిజాబ్ నిషేధించినందుకు హాజరుకాని వారు ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం తొలిరోజు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించారు. మొత్తం 8,69,399 మంది పరీక్షలు రాసేందుకు అర్హులు కాగా 8,48,405 మంది రాశారు. 20,994 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. రాష్ట్రంలో ఏటా 9 లక్షల మంది దాకా పరీక్షలు రాస్తుంటారు. ఇందులో వివిధ కారణాలతో మూడునా లుగువేల మంది దాకా గైర్హాజరవుతుంటారు. కానీ ప్రస్తుతం 20 వేల మం దికి పైగా దాకా గైర్హాజరు కావడం సర్వత్రా చర్చకు దారితీస్తోంది. రాష్ట్రంలో మూడునెలల కిందట ఉడుపిలోని బాలికల జూనియర్ కళాశాలలో హిజాబ్ ధరించి తరగతులకు హాజరుకావడం వివాదమైంది.