శ్రీశైలంలో.. ఉగాది మహోత్సవాలకు ఏర్పాట్లు సిద్ధం: ఈవో లవన్న
1 min readపల్లెవెలుగు వెబ్ : ఈ నెల మార్చి 30వ తేదీ నుండి జరిగే ఉగాది మహోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అయిదు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు ఈవో లవన్న తెలియజేశారు కర్ణాటక మహారాష్ట్ర నుండి వచ్చే కాలినడకన వచ్చిన భక్తులకు నాలుగు రోజుల పాటు స్పర్శ దర్శనం అవకాశం కల్పించారు రెండు సంవత్సరాల నుంచి కన్నడ భక్తులకు స్పర్శ దర్శనం లేనందున నాలుగు రోజులపాటు శ్రీశైల దేవస్థానం వాళ్లు స్పర్శ దర్శనం అవకాశం కల్పించారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం స్పర్శ దర్శనం చేసుకున్న భక్తులు అధికంగా ఉన్నారని ఈవో తెలియజేశారు భక్తుల రద్దీని అధికంగా ఉండటంతో స్పర్శ దర్శనానికి 15 గంటల సమయం పడుతుండటంతో భక్తులు చాలా ఇబ్బందులు పడుతుండటం తో భక్తులు అందరికీ త్వరితగతిన దర్శనం చేయించాలనే ఉద్దేశంతో భక్తులందరికీ అలంకార దర్శనం కల్పించామన్నారు క్యూ లైన్ లో ఉండే వేచి ఉండే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు శ్రీశైలం వస్తున్న భక్తులందరికీ మౌలిక సదుపాయం ఏర్పాట్లు పూర్తిచేశామని పాతాళ గంగలో స్నానం భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేసినట్లు ఈఓ లవన్న వెల్లడించారు.