ప్రధాని అభ్యర్థిగా షెహబాజ్ షరీఫ్
1 min readపల్లెవెలుగువెబ్ : పాకిస్థాన్ దేశ ప్రధాని అభ్యర్థిగా ఆ దేశ ప్రతిపక్ష నేత షెహబాజ్ షరీఫ్ బరిలోకి దిగుతున్నారు. ప్రస్థుత పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఆయన పదవి నుంచి వైదొలగాలని ఒత్తిడి పెరిగింది. పాక్ నేషనల్ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ మెజారిటీ కోల్పోయారు కాబట్టి షెహబాజ్ షరీఫ్ త్వరలో ప్రధానమంత్రి అవుతారని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ ఛైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ చెప్పారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహబాజ్ 2018 ఆగస్టు నెల నుంచి నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు.