జగన్ కు ప్రధాని అయ్యే అవకాశం !
1 min read
పల్లెవెలుగువెబ్ : భవిష్యత్తులో జగన్ ప్రధాని అయ్యే అవకాశం ఉందంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మంత్రి పదవి ఇచ్చే రోజు రెండున్నర సంవత్సరాలు కాలపరిమితి మాత్రమే ఉంటుందని సీఎం జగన్ చెప్పారని తెలిపారు. సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాము శిరసావహిస్తామని స్పష్టం చేశారు. అన్ని శక్తులు ఏకమైనా… జగన్‌ను ఏమి చెయ్యలేరన్నారు. సీఎంగా జగనే కొనసాగుతారని తెలిపారు. ఎన్టీరామారావుకు వారసులు ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో వేషాలు వేసే వారు రాజకీయాలకు పనికిరారు అని చంద్రబాబు అన్నారని గుర్తుచేశారు.