యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు.. ‘ఉగాది’ శుభాకాంక్షలు: ప్రశాంత్ ఎం దేశాయ్
1 min readపల్లెవెలుగు వెబ్:ఉగాది పర్వదినం సందర్భంగా యూనియన్ బ్యాంకు ఖాతాదారులకు, మిత్రులు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు తెలిపారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్నూలు రీజనల్ హెడ్ ప్రశాంత్ ఎం దేశాయ్. శుక్రవారం సాయంత్రం ఆయన ఛాంబరులో విలేకరులతో మాట్లాడారు. జీవితం సకల అనుభూతుల సమ్మేళనం… స్థితప్రజ్ఞత అలవరుచుకోవడం వివేకి లక్షణమన్నారు. కేంద్ర, రాష్ట్ర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించిన ఆయన… యూనియన్ బ్యాంకు అందిస్తున్న సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, కిసాన్ వికాస పత్రాలు, జాతీయ పెన్షన్ సిస్టమ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి అకౌంట్ పథకాలను ఖాతాదారులు ఉపయోగించుకోవాలన్నారు. అదేవిధంగా యూనియన్ హోంలోన్, యూనియన్ మిలీస్, ఎం.ఎస్.ఎం.ఇ. సువిధ, యూనియన్ గోల్డ్ లోన్ స్కీం, బిజినెస్, వెహికల్, ముద్ర, పర్సనల్ వంటి లోన్ సౌకర్యం కల్పించిందని, ఖాతాదారులు నిబంధనులకు అనుగుణంగా లోన్ తీసుకుని సకాలంలో చెల్లించాలని ఈ సందర్భంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కర్నూలు రీజనల్ హెడ్ ప్రశాంత్ ఎం దేశాయ్ వెల్లడించారు. ఉగాది పండగను ప్రజలు,ఖాతాదారులు, బ్యాంకు మిత్రులు, సిబ్బంది సుఖసంతోషాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.