నిరాధార వార్తలు ప్రసారం చేయొద్దు.. గల్లా అశోక్ అక్కడ లేడు !
1 min readపల్లెవెలుగువెబ్ : హైదరాబాద్ లో మరో భారీ రేవ్ పార్టీ బైటపడింది. నగరంలోని రాడిసన్ బ్లూ హోటల్ పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. దాదాపు 157 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున సినీ ప్రముఖులున్నట్టు తెలుస్తోంది. ఫండింగ్ మింక్ అనే పబ్ పై అధికారులు దాడిచేయగా.. ఈ పార్టీలో డ్రగ్స్ వాడినట్టు సమాచారం రావడంతో సోదాలు నిర్వహించారు. ఈ దాడిలో అదుపులోకి తీసుకున్న వారి లిస్ట్ లో గల్లా అశోక్ పేరు కూడా ఉందని మీడియాలో ప్రచారం జరిగింది. దాంతో ఆ వార్తల్ని గల్లా కుటుంబం ఖండించింది. ‘నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ పబ్ పై పోలీసులు జరిపిన రైడ్ లో గల్లా అశోక్ పేరు కూడా జత చేసి కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రసారం చేస్తున్నాయి. ఈ వ్యవహారంలో గల్లా అశోక్ కి ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇలాంటి నిరాధారమైన వార్తలని మీ మీడియాలో ప్రసారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం’.. అంటూ గల్లా ఫ్యామిలీ వివరణ ఇచ్చింది.