మాదకద్రవ్యాల సాగు నిషేధం !
1 min readపల్లెవెలుగువెబ్ : అఫ్ఘానిస్తాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. మాదకద్రవ్యాలు, నల్లమందు లాంటివి సాగు చేయకూడదని అఫ్ఘాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. ఈ ఆదేశాలను ఎవరైనా అతిక్రమించి సాగు చేస్తే పంటను ధ్వంసం చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై షరియా చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే ఆదేశాల్లో మత్తు పదార్థాలను రవాణా చేయడం, నిల్వ చేయడంపై కూడా నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు.